Jobs | కేంద్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ.. అయినా పోస్టులు భర్తీ చేయని బీజేపీ సర్కారు
Jobs | ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పింది. వివిధ మంత్రిత్వ శాఖలతో సహా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటులో ప్రకటించింది.
Jobs | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పింది. వివిధ మంత్రిత్వ శాఖలతో సహా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్లమెంటులో ప్రకటించింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, కార్మిక, ఉపాధి శాఖల కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. గత మార్చి 1 నాటికి వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,64,354 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. దేశంలో గత 45 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా ఇటీవల నిరుద్యోగిత రేటు పెరుగుతున్నది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ప్రకారం ఏప్రిల్ నాటికి నిరుద్యోగిత రేటు 8.11 శాతంగా నమోదైంది. 2017లో 6.1 శాతంగా నిరుద్యోగిత రేటు ఉన్నది. 22 కోట్ల మందికి ఉద్యోగాలు అవసరం ఉన్నట్లు సర్వే నివేదికలు చెబుతున్నాయి.
ఉపాధి రంగాలకు బడ్జెట్ కోత వల్లే..
ఎన్నడూ లేనంత నిరుద్యోగిత రేటు పెరగటానికి ప్రధాని మోదీ పాలనా పరమైన నిర్ణయాలు కొంత వరకు కారణంగా కనిపిస్తున్నాయి. 2023-24 బడ్జెట్లో జాతీయ ఉపాధి హామీ పథకానికి 33 శాతం నిధుల కోత పెట్టారు. గ్రామీణ గృహ నిర్మాణ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్ పథకాలకు కేంద్రం కేటాయింపులను తగ్గించింది. 2 లక్షలకు పైగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా లక్షల పరిశ్రమలు మూతపడడంతో నిరుద్యోగం పెరిగిపోతున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

