HomeNationalThe 1st Of Next Month Regarding Important Financial Aspects Such As Pan It Returns Small Savings Etc
అక్టోబర్ 1 నుంచి వచ్చే మార్పులివే..
పాన్, ఐటీ రిటర్న్స్, చిన్న మొత్తాల పొదుపు తదితర ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: పాన్, ఐటీ రిటర్న్స్, చిన్న మొత్తాల పొదుపు తదితర ముఖ్యమైన ఆర్థిక అంశాలకు సంబంధించి వచ్చే నెల 1 నుంచి కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. అవేంటో చూద్దాం..
పాన్, ఐటీ రిటర్న్స్ – వ్యక్తులు పాన్ నెంబర్ కోసం, ఆదాయ పన్ను రిటర్న్స్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వారి ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడీని ఉపయోగించడాన్ని అనుమతించరు.
బోనస్ షేర్లు – టీ+2 ట్రేడింగ్‌కు; వాటి క్రెడిట్, ట్రేడింగ్ తేదీకి, రికార్డ్ తేదీ మధ్య సమయాన్ని తగ్గించడానికి బోనస్ షేర్లు అర్హత పొందుతాయి.
చిన్న మొత్తాల పొదుపు పథకాలు – తపాల కార్యాలయాల్లోని క్రమరహిత ఖాతాల వివరాలను క్రమబద్ధీకరణ కోసం ఆర్థిక శాఖకు నివేదించాలి. తాత, బామ్మలు సుకన్య సమృద్ధి యోజనను తమ మనవరాలి పేరున ప్రారంభిస్తే వాటిని సంరక్షకులు లేదా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పేరున మార్చుకోవచ్చు. రెండు కంటే ఎక్కువ ఖాతాలు తెరిచి ఉంటే, అదనపు ఖాతాలను మూసివేస్తారు.
సెక్యూరిటీ లావాదేవీల పన్ను(ఎస్టీటీ) – ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఎస్టీటీ పెరుగుతుంది.
రైల్వే స్పెషల్ డ్రైవ్ – రద్దీ వారాల్లో టికెట్ లేని ప్రయాణికులను గుర్తించడానికి రైల్వే స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది.
పోస్టాఫీస్ ఖాతాలు, పీపీఎఫ్ వడ్డీ రేట్లలో మార్పులు – మైనర్ల పీపీఎఫ్ ఖాతాలు, చిన్న మొత్తాల పొదుపు ఖాతాల వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి.
వివాద్ సే విశ్వాస్ అమలు – వివిధ కోర్టులు, అప్పిలేట్ అథారిటీల్లో పెండింగ్‌లో ఉన్న పన్ను చెల్లింపుదారుల వివాదాలు, అప్పీళ్లు, పిటిషన్లు సెటిల్ చేసుకొనేందుకు అవకాశం.
ధ్రువీకరించని లింక్‌లు, ఎస్ఎంఎస్లు బ్లాక్ – ఆమోదం పొందని, ధ్రువీకరించని యూఆర్ఎల్లు, ఓటీటీ లింక్‌లు, ఏపీకేలను టెలికం ప్రొవైడర్లు బ్లాక్ చేయాల్సి ఉంటుంది.