అధిక బరువుతో బాధపడుతున్నారా.. అయితే మీరు ఇవి తప్పక తినాలి..!
Thati Gagulu: తాటి గేగులు..! వీటినే తేగలు అని కూడా అంటారు..! తాటి గింజలు మొలకెత్తినప్పుడు నేలలోకి చొచ్చుకెళ్లే లేలేత వేర్లే ఈ గేగులు, తేగలు. ప్రతి ఏడాది

హైదరాబాద్: తాటి గేగులు..! వీటినే తేగలు అని కూడా అంటారు..! తాటి గింజలు మొలకెత్తినప్పుడు నేలలోకి చొచ్చుకెళ్లే లేలేత వేర్లే ఈ గేగులు, తేగలు. ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇవి ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. ఈ తాటి గేగులను కాల్చిగానీ, ఉడకబెట్టుకునిగానీ తింటే ఎంతో రుచిగా ఉంటాయి. రుచికి తోడు శరీరానికి అవసరమైన ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు వీటిలో ఉంటాయి. మరి ఆ పోషకాలేంటో తెలుసుకుందాం..!
తాటి గేగులతో బరువుకు చెక్..
- తాటి గేగులలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తదితర పోషకాలు సమృద్ధిగా లభ్యమవుతాయి.
- ఊబకాయంతో బాధపడేవారికి ఈ తాటి గేగులలోని ఫైబర్ బాగా ఉపయోగపడుతుంది. ఈ గేగులను నేరుగా తినడం ఇష్టంలేనివారు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి, ఎండబెట్టుకుని పిండిగా మార్చుకుని కూడా తీసుకోవచ్చు.
- ఈ తాటి గేగుల పిండితో రొట్టెలు తయారు చేసుకుని తింటే ఆ పిండిలోని ఫైబర్వల్ల వేగంగా బరువు తగ్గుతారు.
- అంతేగాక, ఈ తాటి గేగులు శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతానికి కూడా బాగా తోడ్పడుతాయి.
- ఒంట్లో వేడిని తగ్గించడంలో కూడా తాటి గేగులు కీలకపాత్ర పోషిస్తాయి.
- రక్తహీనత సమస్యకు కూడా తాటి గేగులతో చక్కని పరిష్కారం లభిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

