న్యూఢిల్లీ : మసాలా దినుసుల ప్యాకెట్లను స్వయంగా పరీక్షించుకోవాలని పెద్ద కంపెనీలను ఆదేశించే యోచనలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఉన్నట్లు సమాచారం. భారత దేశం నుంచి ఎగుమతి అయిన స్పైస్ మిక్సెస్‌ను సింగపూర్, హాంకాంగ్ తిప్పి పంపిన నేపథ్యంలో దీనిపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నది. తక్కువ పరిమాణంలో ప్రాసెస్ చేసి, స్థానికంగా విక్రయించే కంపెనీలకు ఈ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ అంశం గురించి తెలిసిన ఉన్నతాధికారి ఒకరు తెలిపిన వివరాల ప్రకారం.. మసాల ప్యాకెట్ల ప్రతి బ్యాచ్‌ను పెద్ద కంపెనీలు తమంతట తామే పరీక్షించుకోవాలని ఆదేశించే అవకాశం ఉంది.