ట్యాక్సులు తగ్గించండి.. మోదీని కోరిన టెస్లా

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ఎలన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ నెంబర్ వన్. అయితే ఆ కంపెనీ ఇండియాలో తన వాహనాలను అమ్మాలనుకుంటున్నది. మన దేశంలో ఇంపోర్టెడ్ కార్లు అమ్మాలంటే.. దిగుమతి సుంకం చెల్లించాల్సిందే. అయితే ఆ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నట్లు టెస్లా కంపెనీ ఆరోపిస్తున్నది. ఎలక్ట్రిక్ వాహనాలపై దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కోరుతూ.. ప్రధానమంత్రి కార్యాలయానికి టెస్లా కంపెనీ ప్రతినిధులు వెళ్లినట్లు తెలుస్తోంది. ఇంపోర్ట్ ట్యాక్సులు ఇండియాలో ఎక్కువగా ఉన్నట్లు టెస్లా ప్రతినిధులు చెబుతున్నారు. ఒకవేళ ఆ సుంకాన్ని తగ్గిస్తే, అప్పుడు దేశీయ ఉత్పత్తి రంగంలో పెట్టుబడులు తగ్గుతాయని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెస్లా ఇండియా ఎగ్జిక్యూటివ్ మనుజ్ ఖురానా.. ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గింపు అంశంపై.. ప్రధానమంత్రి కార్యాలయ అధికారులతో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఉన్న పన్ను విధానం తమ కంపెనీకి అనుకూలంగా లేదని టెస్లా అధికారులు చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 60 శాతం దిగుమతి సుంకాన్ని ఇండియా వసూల్ చేస్తున్నది. పన్నులు ఎక్కువ స్థాయిలో కట్టడం వల్ల.. వాహనాల ఖరీదు మరింత ప్రియం అవుతుందని టెస్లా అధికారులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రధాని మోదీని టెస్లా సీఈవో ఎలన్ మస్క్ కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- import taxes
- Pm Modi
- PMO
- tesla
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

