శ్రీనగర్: లాల్ బజార్‌లోని జమ్మూకశ్మీర్ పోలీసు నాకాపై ఉగ్రవాదులు సోమవారం కాల్పులు జరిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఈ కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మృతిచెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడిని ఏఎస్ఐ ముస్తాక్ అహ్మద్‌గా గుర్తించారు.
‘ఉగ్రవాదుల కాల్పుల్లో ఏఎస్ ముస్తాక్ అహ్మద్‌కు గాయాలయ్యాయి. ఆయన అమరవీరుడయ్యాడు. విధి నిర్వహణలో ఆయన చేసిన అత్యున్నత త్యాగానికి సెల్యూట్ చేస్తున్నాం. అమరవీరుడికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. గాయపడిన మరో ఇద్దరు సిబ్బంది చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు త్వరలో అందిస్తాం.’ అని జమ్మూకశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు.