Human GPS Killed : ‘ఆపరేషన్ సిందూర్’తో మొదలైన ఉగ్రవాదుల ఏరివేత ఇప్పటికీ కొనసాగుతోంది. జమ్ముకశ్మీర్‌లో తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో ‘హ్యూమన్ జీపీఎస్’గా పేరొందిన ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రకుట్రలు పన్నడం, సరిహద్దు వెంబడి చొరబాట్లకు మూలమైన బగు ఖాన్ (Bagu Khan) అలియాస్ సమందర్ చాచాను శనివారం భారత భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. కరుడుగట్టిన ఉగ్రవాది అయిన బగుఖాన్ 1995 నుంచి పాక్ అక్రమిత కశ్మీర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. భారత్‌లో విధ్వంస కాండకు వ్యూహ రచన చేయడంతో పాటు ఉగ్రమూకల్ని సరిహద్దు దాటించడంలో కీలకమైన పాత్ర పోషించిన బగు ఈసారి తప్పించుకోలేకపోయాడు.
శనివారం మరొక టెర్రరిస్ట్‌తో కలిసి నౌషెరా నార్ (Nowshera Naar) ప్రాంతంలో బార్డర్ దాటబోయాడు బగు. వాళ్లను అడ్డుకునేందుకు భారత సైన్యం కాల్పలు జరిపింది. ఇరువర్గాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో బగు సహ అతడితో వచ్చిన మరో ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. గురెజ్ సెక్టార్ (Gurez Sector) నుంచి వందకు పైగా జరిగిన చొరబాటు ప్రయత్నాల్లో బగు ఖాన్ హస్తం ఉందని.. వీటిలో చాలావరకూ విజయవంతం అయ్యాయని భారత సరిహద్దు దళాలు పేర్కొన్నాయి.
‘Human GPS’ eliminated. Indian Army neutralised top infiltration facilitator Bagu Khan aka ‘Samundar Chacha’ from Muzaffarabad, PoK—accused of aiding 100+ infiltration bids since 1995 and famed for knowing every route across the LoC. Officials say he was killed during an… pic.twitter.com/zlKbTVByy1
— Defence Chronicle India ™ (@TheDCIndia) August 30, 2025
బగా ఖాన్ తొలి నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేవాడు. అతడు హిజ్బుల్ కమాండర్‌గా ఉన్నప్పుడు ప్రతి ఉగ్రదాడి ప్రణాళికలో పాల్గొన్నాడు. సరహద్దు ప్రాంతాలపై పూర్తి అవగాహన కలిగిన బగా గురెజ్, సమీప ప్రాంతాల నుంచి పలువురిని లైన్ ఆఫ్ కంట్రోల్ దాటించడంలో కీలకంగా వ్యవహరించాడు. కొన్నేళ్లుగా భారత సైన్యం నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడు ఎట్టకేలకు ఎన్కౌంటర్లో హతమయ్యాడు. అతడి చావుతో పీఓకేలోని ఉగ్రమూకలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టే.