శ్రీనగర్: జమ్మూ కశ్మీరులోని జైళ్లకు ఉగ్రవాద దాడి ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాల నుం చి సమాచారం అందడంతో అప్రమత్తమైన అధికారులు జైళ్ల వద్ద భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్‌లోని సెంట్రల్ జైలు, జమ్మూలోని కోట్ బల్వాల్ జైలు తదితర హై సెక్యూరిటీ జైళ్లపై ఉగ్రవాదులు దాడి చేసే ప్రమాదం ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు జారీ అయ్యా యి. ఈ జైళ్లలో ప్రస్తుతం పేరు మోసిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలకు చెందిన స్లీపర్ సెల్స్ బందీలుగా ఉన్నారు. స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులకు అవసరమైన రవా ణా, ఆశ్రయం వంటివి కల్పిస్తారు.