జామియా మిలియాలో ఉద్రిక్తత
క్యాంపస్ ఎన్నికలను పునరుద్ధరించాలని విద్యార్థుల ఆందోళన.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో క్యాంపస్ ఎన్నికలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులకు, సెక్యూరిటీ గార్డులకు మధ్య శనివారం ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు విశ్వవిద్యాలయం అన్ని తరగతులను తక్షణమే ఆన్‌లైన్‌లోకి మారుస్తున్నట్లు ప్రకటించింది. ఆందోళనకారులు వేసిన టెంట్లను తొలగించేందుకు సెక్యూరిటీ గార్డులు ప్రయత్నించడంతో వివాదం చెలరేగింది.
జామియా మిలియా ఇస్లామియా స్టూడెంట్స్ యూనియన్(జేఎంఐఎస్యూ)ను పునరుద్ధరించాలని, చీఫ్ ప్రాక్టర్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐదుగురు విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష శనివారం నాటికి 13వ రోజుకు చేరింది. నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థులు, నిరసన ప్రదేశంలో ఉన్నవారిపై దాడులు జరుగుతున్నాయని ఏఐఎస్ఏ ఆరోపించింది. దీనికితోడు విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో వెలసిన ‘ఫ్రీ షర్జీల్ ఇమామ్’, ఫ్రీ కశ్మీర్ పోస్టర్లు మరింత వివాదానికి దారితీశాయి. యాంటీ- సీఏఏ అల్లర్ల కేసులో జైలులో ఉన్న జేఎన్‌యూ పీహెచ్డీ స్కాలర్ షర్జీల్ ఇమామ్ విడుదల చేయాలని కోరుతున్న పోస్టర్లు కనిపించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

