TMC MLAs : అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ఓటమితో ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ డీలాపడింది. ఈ క్రమంలో తాజాగా మమతాబెనర్జి (Mamata Banerjee) నిర్వహించిన ఓ కీలక సమావేశానికి పది మంది టీఎంసీ ఎమ్మెల్యేలు (TMC MLAs) గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయ్యింది. తృణమూల్ కాంగ్రెస్ నుంచి మొత్తం 80 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. వారిలో కేవలం 70 మంది మాత్రమే మమతాబెనర్జితో సమావేశానికి హాజరయ్యారు.
రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు, పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని తొలగించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. కానీ ఈ సమావేశానికి ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో పార్టీలో చీలిక ఏర్పడిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఆ ఊహాగానాలను టీఎంసీ తోసిపుచ్చింది. గైర్హాజరుపై వారు ముందుగానే సమాచారం ఇచ్చారని వెల్లడించింది.