శనివారం 04 జూలై 2020
National - Jun 30, 2020 , 18:01:53

కేరళలో పది ఫలితాలు విడుదల.. 98.82శాతం ఉత్తీర్ణత

కేరళలో పది ఫలితాలు విడుదల.. 98.82శాతం ఉత్తీర్ణత

కేరళ : కేరళ రాష్ట్ర బోర్డు పదో తరగతి ఫలితాలను మంగళవారం ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 4,22,092 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. అందులో 4,17,101 మంది ఉత్తీర్ణత సాధించారు.  ఉత్తీర్ణత శాతం 98.82%. ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు తెలియజేశారు. 41,906 మందికి పరీక్షలో ఏ గ్రేడ్‌ వచ్చిందని, పఠన్‌మిట్ట జిల్లాలో 99.71% మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు తెలిపారు. వయనాడ్ జిల్లాలో అత్యల్పంగా 95.04% ఉత్తీర్ణత కాగా మల్లాపురం జిల్లా నుంచి అత్యధికంగా 2756 మంది విద్యార్థులు ఏ గ్రేడ్‌ ఫలితాలు పొందారు. 

కేరళ ప్రభుత్వం అన అధికారిక వెబ్‌సైట్‌ keralapareeksahabhavan.in, results.kerala.nic.in లో ఫలితాలను విడుదల చేసింది. విద్యార్థులు వారి ఫలితాలను చూసుకోవడానికి హాల్‌టిక్కెట్‌ నెంబర్‌తో పాటు పుట్టిన తేదిని వెబ్‌సైట్‌లో ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.

గతేడాది కేరళ బోర్డు మే 6న పదో తరగతి ఫలితాలను విడుదల చేసింది. అయితే ఈసారి కరోనా మహమ్మారి సంక్షోభం వల్ల ఫలితాల విడుదలలో జాప్యం నెలకొంది. లాక్‌డౌన్‌ కారణంగా కొన్ని పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. మిగిలిన పరీక్షలు జూన్ 26 నుండి ౩౦ మధ్య నిర్వహించారు. గత సంవత్సరం 97.84శాతం ఉత్తీర్ణత సాధించగా ఈ ఏడాది 98.82శాతం సాధించారు. 


logo