గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 22:13:38

రాష్ట్రంలో వైద్యుల నియామ‌కానికి ఉత్త‌ర్వులు జారీ

రాష్ట్రంలో వైద్యుల నియామ‌కానికి ఉత్త‌ర్వులు జారీ

హైద‌రాబాద్‌: తెలంగాణ‌లోని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌లో వైద్యుల నియామకానికి ప్రభుత్వం కసరత్తు మొద‌లుపెట్టింది. ఈ మేర‌కు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్త‌ర్వులు కూడా జారీచేసింది.‌ మొత్తం 227 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లను ఒప్పంద పద్ధతిలో నియమించాలని ప్ర‌భుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లోగ‌ల‌ పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల‌లో ఖాళీలను ఒప్పంద ప్రాతిప‌దిక‌న అరు నెల‌ల కాలానికి భ‌ర్తీ చేయ‌నున్నారు. 

ఇక పీజీ ఫైన‌ల్ ఇయ‌ర్ చదువుతున్న వైద్య విద్యార్థులను ఏడాది ఒప్పందంతో సీనియర్ రెసిడెంట్లుగా నియమించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. మొత్తం 1,191 మందిని సీనియ‌ర్ రెసిడెంట్లుగా నియ‌మించి, వారికి నెలకు రూ.70 వేల చొప్పున‌ వేతనం చెల్లించనుంది. గాంధీ ఆస్ప‌త్రిలో- 250 మంది, కింగ్ కోఠి ఆస్ప‌త్రిలో - 100 మంది, గచ్చిబౌలి టిమ్స్‌లో- 150 మంది, ఛాతీ ఆస్ప‌త్రిలో- 50 మంది, ఎనిమిది ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 50 మంది చొప్పున మొత్తం 400 మంది, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రులకు 241 మంది వైద్య విద్యార్థుల‌ను సీనియ‌ర్ రెసిడెంట్లుగా నియమించాలని ఆర్థికశాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్న‌ది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo