e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home News కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో సీఎం కేసీఆర్ భేటీ

కేంద్ర మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో సీఎం కేసీఆర్ భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ‌నివారం మ‌ధ్యాహ్నం కేంద్ర జ‌ల‌శక్తి శాఖ మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సాగునీటి ప్రాజెక్టులు, జ‌లాల పంపిణీపై 40 నిమిషాల పాటు చ‌ర్చించారు. నిన్న మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన విష‌యం విదిత‌మే.

గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్‌ను క‌లిసిన వారిలో సీఎం కేసీఆర్‌తో పాటు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ల‌క్ష్మారెడ్డి, రాజేంద‌ర్ రెడ్డి, ఆల వెంక‌టేశ్వ‌ర్ రెడ్డి ఉన్నారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం వల్ల మహబూబ్‌న‌గ‌ర్ జిల్లాకు జ‌రుగుతున్న న‌ష్టం, కృష్ణా జలాల వివాదంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడంతో పాటు, నీటి కేటాయింపులు జరపాలని కేంద్రమంత్రిని కోరినట్లు సమాచారం. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్ అమలు తేదీ వాయిదా అంశాన్ని మరోసారి షేకావత్ వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య సంయుక్తంగా ఉన్న ప్రాజెక్టులను మాత్రమే నోటిఫికేషన్ పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర‌మంత్రిని కేసీఆర్ కోరినట్లు సమాచారం.

26న (ఆదివారం) ఢిల్లీ విజ్ఞాన్‌భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నిర్వహించే నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం ధా న్యం కొనుగోలు అంశంపై కేంద్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో సమావేశం అవుతారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివస్తారు. సీఎం వెంట ఢిల్లీకి వెళ్లిన అధికారుల్లో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement