Tejashwi Yadav : బీహార్ (Bihar) లో ప్రతిపక్ష నాయకుడు, ఆర్జేడీ అగ్రనేత (RJD top leader) తేజస్వి యాదవ్ (Tejaswi Yadav) పర్యటనలో భద్రతాలోపం తలెత్తింది. ముజఫర్‌పూర్ (Muzafarpur) జిల్లా పర్యటనలో భాగంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న తేజస్వి యాదవ్.. హెలికాప్టర్లో తిరిగి వెళ్లేందుకు సిద్ధపడుతుండగా ఓ యువకుడు సెక్యూరిటీ వలయాన్ని ఛేదించుకుని పరుగుపరుగున ఆయన దగ్గరికి వచ్చి పాదాలపై పడ్డాడు.
దీనికిముందు ముజఫర్‌పూర్‌లోని కాంతి స్కూల్లో భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని తేజస్వి యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొని బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అప్పుడే నల్లటి చొక్కా ధరించిన ఒక యువకుడు సెక్యూరిటీ వలయాన్ని చేధించుకుని తేజస్వి చెంతకువచ్చి ఆయన పాదాలపైపడ్డాడు. దాంతో ఒక్కసారిగా తేజస్వి దిగ్భ్రాంతికి గురయ్యారు. భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. సదరు యువకుడి పేరు షరీఫుల్ ఇస్లామ్‌గా గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేజస్వి యాదవ్‌పై ఉన్న అభిమానానికి ఇది నిదర్శనమని కొందరు.. తీవ్రమైన భద్రతాలోపమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. బీహార్‌లో ఈ తరహా భద్రతాలోపం తలెత్తడం ఇదే ప్రథమం కాదు. గతంలోనూ ఇలాంటి భద్రతాలోపాలు చోటుచేసుకున్నాయి. ఆగస్టులో ‘ఓటర్ అధికార్ యాత్ర’లో గుర్తుతెలియని వ్యక్తి భద్రతావలయాన్ని ఛేదించుకుని వచ్చి రాహుల్‌గాంధీని ముద్దుపెట్టుకున్నాడు. రాహుల్‌గాంధీ పూర్నియాలో తేజస్వి యాదవ్‌తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది.
तेजस्वी यादव की सुरक्षा में चूक, हेलीकॉप्टर तक पहुंचा युवक और छू लिए पैर – वीडियो वायरल || Jan Express@yadavtejashwi #securitybreach #viralvideo #BiharPolitics #PoliticalNews #TejashwiYadav #BreakingNews #janexpress #TrendingNews pic.twitter.com/6YhXZNQcfH
— JanExpress (@JanExpressNews) September 14, 2025