Nitish Kumar | పట్నా, జనవరి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బాలికలు, యువతులు ఇప్పుడు మంచి దుస్తులు వేసుకుంటున్నారని.. గతంలో వారు మంచి దుస్తులు ధరించారా.. అని బీహార్ సీఎం నితీశ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలను ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్ తీవ్రంగా తప్పుబట్టారు.
నితీశ్ కుమార్ బాలికలను అవమానించారని మండిపడ్డారు. శనివారం బెగుసరాయ్‌లో నిర్వహించిన ప్రగతియాత్రలో నితీశ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తేజస్వి యాదవ్ ఎక్స్‌లో నీతిశ్ వీడియోను పోస్ట్ చేశారు. షేమ్ ఆన్ నితీశ్ అని ట్యాగ్ పెట్టారు. ‘70ఏండ్ల నితీశ్ సీఎంగా ఉన్నారని, మహిళల ఫ్యాషన్ డిజైనర్ కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి’ అని అన్నారు.