Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి గురువారంతో తెరపడనుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు చివరి రోజు భారీ ర్యాలీలు, రోడ్‌షోలతో హోరెత్తిస్తున్నాయి. పరస్పర విమర్శలతో విరుచుకుపడుతున్నాయి.
ఇక బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పట్నాలో విలేకరులతో మాట్లాడుతూ ఈసారి కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు ప్రచారానికి చివరిరోజని, ఇక తమ కూటమికి 300కిపైగా స్ధానాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
నిరుద్యోగం, పేదరికం, ధరల మంటతో ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని పాలక బీజేపీ పరాజయాన్ని మూటగట్టుకోనుందని పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఎన్డీయే కూటమికి 400పైగా స్ధానాలు లభిస్తాయని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
Read More :
Harish Rao | ఎన్హెచ్ఎం ఉద్యోగులకు పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి: హరీశ్ రావు