Tej Pratap: వారణాసి హోటల్ రూమ్ నుంచి తేజ్ ప్రతాప్ లగేజీ తొలగింపు
Tej Pratap Yadav: తేజ్ ప్రతాప్ యాదవ్ లగేజీని హోటల్ రూమ్ నుంచి తీసేశారు. దర్శనం కోసం వెళ్లిన తేజ్ హోటల్‌కు వచ్చే లోపు ఆయన లగేజీని రిసెప్షన్‌కు తరలించారు. వారణాసిలో ఈ ఘటన జరిగింది. దీనిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
వారణాసి: బీహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్(Tej Pratap Yadav)కు అవమానం జరిగింది. ఆయనకు చెందిన లగేజీని హోటల్ రూమ్ నుంచి తొలగించారు. ఈ ఘటన వారణాసిలోని ఓ హోటల్లో జరిగింది. కాశీ విశ్వనాథుడి దర్శనం కోసం వెళ్లినప్పుడు.. హోటల్ రూమ్‌లో ఉన్న లగేజీని బయటకు తీసి రిసెప్షన్ కౌంటర్ వద్ద పెట్టారు. మంత్రి తేజ్ పర్సనల్ అసిస్టెంట్ విశాల్ సిన్హా దీనిపై ఫిర్యాదు చేశారు. మంత్రికి రూమ్ కేటాయించిన తర్వాత ఆ రూమ్ నుంచి ఎలా లగేజీని తీసేశారని ఆయన ప్రశ్నించారు.
శుక్రవారం రాత్రి దర్శనం తర్వాత తేజ్ ప్రతాప్ హోటల్‌కు రాగానే.. ఆయన లగేజీ రిసెప్షన్ వద్ద ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ ఘటన పట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏసీపీ సంతోష్ సింఘ్ వివరణ ఇచ్చారు. ఏప్రిల్ 6న బీహార్ పర్యావరణ శాఖ తరపున రూమ్ బుక్ అయిందని, కానీ ఏడవ తేదీన మరొకరికి ఆ రూమ్ బుక్ అయి ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఇంతకీ ఆ రూమ్ ఎవరి పేరిట్ బుక్ చేశారో హోటల్ మేనేజ్మెంట్కు తెలియదని, తేజ్ ప్రతాప్ యాదవ్ కోసం యాజమాన్యం చాలా సేపు ఎదురుచూసిందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

