Tehran airport | 20 రోజుల తర్వాత టెహ్రాన్ ఎయిర్‌పోర్టుకు తొలి విదేశీ విమానం..!
Tehran airport | ఇరాన్, ఇజ్రాయెల్ (Iran vs Israel) పరస్పర దాడులతో రణరంగంలా మారిన పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. తమపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ వైమానిక సేవలను నిలిపివేసిన ఇరాన్.. తాజాగా వాటిని పునరుద్ధరించింది.
Tehran airport : ఇరాన్, ఇజ్రాయెల్ (Iran vs Israel) పరస్పర దాడులతో రణరంగంలా మారిన పశ్చిమాసియాలో పరిస్థితులు క్రమంగా చక్కబడుతున్నాయి. తమపై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో అంతర్జాతీయ వైమానిక సేవలను నిలిపివేసిన ఇరాన్.. తాజాగా వాటిని పునరుద్ధరించింది. 20 రోజుల నిషేధం తర్వాత టెహ్రాన్ (Tehran) లోని ఇమామ్ ఖొమేని అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలిసారిగా విదేశీ విమానం దిగింది.
ఈ విషయాన్ని ఇరాన్ మీడియా వెల్లడించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి ‘ఫ్లైయింగ్ దుబాయ్’ సంస్థకు చెందిన విమానం భారీ భద్రత నడుమ ల్యాండ్ అయినట్లు ఇరాన్ పౌర విమానయాన శాఖ తెలిపింది. ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల అనంతరం తాజా పరిణామం.. ఇరాన్ వైమానిక రంగం స్థిరత్వం సాధించే దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుందని పౌర విమానయాన శాఖ అధికార ప్రతినిధి మెహ్దీ రమేజానీ వెల్లడించారు.
అంతర్జాతీయ విమానాలు ఇరాన్లో సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా అవసరమైన చర్యలు చేపడతామని, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని క్రమంగా సర్వీసుల సంఖ్యను పెంచుతామని రమేజానీ తెలిపారు. కాగా ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా ఇటీవల ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ కూడా అదేస్థాయిలో విరుచుకుపడింది. ఈ క్రమంలోనే ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. 12 రోజుల ఉద్రిక్తతల తర్వాత అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలోనే క్రమంగా వైమానిక సేవలు ప్రారంభమవుతున్నాయి.
Read More >>
ఘోరం.. హైవేపై కారును కిలో మీటర్ ఈడ్చుకెళ్లిన లారీ.. ఇద్దరు దుర్మరణం..!
దారుణం .. ఇన్ఫెక్షన్కు చికిత్స కోసం వెళ్తే జననాంగాలను తొలగించిన వైద్యులు..!
రూ.3.8 లక్షలకు నెలకు రూ.38 వేల వడ్డీ.. అప్పు తీర్చలేక వ్యక్తి ఆత్మహత్య
‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులకు నేరస్తుడి వార్నింగ్
మరొకరితో వివాహేతర బంధం.. భార్యను పొడిచి చంపిన భర్త.. తర్వాత ఏమైందంటే..!
ఈ నెల 21 నుంచి రాజ్యసభ 268వ సెషన్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

