న్యూఢిల్లీ: అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మాజీ మహిళా టీచర్(US Teacher)కు 30 ఏళ్ల జైలుశిక్ష ఖరారైంది. ఓ టీనేజ్ విద్యార్థితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న కేసులో ఈ శిక్షను విధించారు. మెలిసా కర్టిస్ అనే 32 ఏళ్ల టీచర్‌కు థార్డ్ డిగ్రీ సెక్స్ అఫెన్స్ కింద శిక్ష వేశారు. శిక్షాకాలం పూర్తి అయిన తర్వాత కర్టిస్ కు మరిన్ని ఆంక్షలు విధించారు. కేవలం తన పిల్లలు తప్ప మైనర్లకు ఆమెను దూరంగా పెట్టాలని ఆదేశించారు. 8వ గ్రేడ్ విద్యార్థికి మద్యంతో పాటు మారిజోనా మత్తుపదార్ధాన్ని ఇచ్చి.. ఆ కుర్రాడితో టీచర్ శృంగారంలో పాల్గొన్నది. సుమారు 20 సార్లు ఆమె శృంగారంలో పాల్గొన్నట్లు విచారణలో తేలింది. స్కూల్ టైం ముగిసిన తర్వాత స్పెషల్ క్లాసు పేరుతో ఇద్దరు మాత్రమే ఉండేవారని ప్రాసిక్యూటర్ తెలిపారు. అక్టోబర్ 2023లో ఈ కేసు విచారణ మొదలైంది.