జైపూర్: పరీక్ష రాస్తున్న విద్యార్థిని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యలో ఆపించాడు. ఆ స్టూడెంట్‌తో కోడి కోయించి స్కిన్ తీయించి, ముక్కలుగా కట్ చేయించాడు. (Teacher Forces Student To Cut Chicken) వండేందుకు ఆ కోడి మాంసాన్ని ఇంటికి పంపించాడు. ఈ విషయం గ్రామస్తుల దృష్టికి వెళ్లింది. దీంతో మంత్రికి వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కొటాడ ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 9వ తరగతి విద్యార్థి రాహుల్ కుమార్ పరీక్ష రాస్తుండగా టీచర్ మోహన్‌లాల్ దోడా పిలిచాడు. అతడు పరీక్ష రాయడాన్ని మధ్యలోనే ఆపించాడు. ఆ స్టూడెంట్ చేత కోడిని కోయించాడు. దాని స్కీన్ తీసి ముక్కలుగా కట్ చేయించాడు. ఆ తర్వాత వంట కోసం కోడి మాంసాన్ని తన ఇంటికి పంపాడు.
కాగా, ఆ గ్రామస్తులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఉపాధ్యాయుడు మోహన్‌లాల్ ప్రవర్తనపై వారు మండిపడ్డారు. మంత్రి బాబులాల్ ఖరారీని కలిసి దీని గురించి ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆయన ఆదేశించారు.
మరోవైపు ప్రభుత్వ ఉపాధ్యాయుడు మోహన్‌లాల్ నెల కిందట స్కూల్ కుక్‌ను తొలగించాడు. నాటి నుంచి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందడం లేదు. అలాగే ఆ టీచర్ విద్యార్థులతో వ్యక్తిగత పనులు చేయిస్తున్నాడని స్థానికులు ఆరోపించారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ఉపాధ్యాయుడు మోహన్‌లాల్‌ను విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు.