భోపాల్, నవంబర్ 20: చాయ్‌వాలాకు రూ.30 వేలు బాకీ పడ్డాడో బీజేపీ ఎమ్మెల్యే.. అది కూడా నాలుగేండ్ల కిందట.. కాయాకష్టం చేసి సంపాదించుకొనే ఆ చిరువ్యాపారికి అంత మొత్తం అంటే చాలా ఎక్కువ. అందుకే.. ఎమ్మెల్యే కనిపిస్తే నిలదీయాలని అనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఓ కార్యక్రమానికి గ్రామానికి రావటంతో రోడ్డు మీదే నిలదీశాడు. మధ్యప్రదేశ్‌లోని ఇచ్చావర్ ఎమ్మెల్యే కరణ్సింగ్వర్మ.. ఓ కార్యక్రమానికి రాగా, చాయ్‌వాలా కారు ఆపి తనకు బకాయి పడ్డ రూ.30 వేలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో మరుసటి రోజు తనను కలవాలని ఆ చాయ్‌వాలాకు ఎమ్మెల్యే చెప్పారు.