హైదరాబాద్ : ప్రముఖ వ్యాపార వేత్త రతన్ టాటా 72వీ నానో ఈవీ కారును అందుకున్నారు. ఈ విషయాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ పవర్ట్రెయిన్ సొల్యూషన్స్ సంస్థ వెల్లడించింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ పవర్ట్రెయిన్ సొల్యూషన్స్ రూపొందించిన 72వీ నానో ఎలక్ట్రిక్ కారును రతన్ టాటాకు అందించింది. ఈ విషయాన్ని ఎలక్ట్రా ఈవీ లింక్డ్ఇన్ ఖాతా ద్వారా తెలిపింది. రతన్ టాటాకు కారు డెలివరీ చేసినందుకు గర్వంగా ఉందని, ఆయన నుంచి మంచి ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందని ఆ సంస్థ తెలిపింది.
ఈ సందర్భంగా రతన్ టాటా తోపాటు ఆయన అసిస్టెంట్ 28 ఏళ్ల శాంతను నాయుడు కలిసి ఉన్న చిత్రాన్ని కూడా పోస్ట్ చేసింది “ఎలక్ట్రా ఈవీ”. 72వీ నానో ఈవీ కారులో నాలుగు సీట్లు ఉంటాయి. ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 160 కిలోమీటర్ల దూరం మేర ప్రయాణించవచ్చు.10 సెకన్లలోపు 0-60 కి.మీ. వెళ్తుంది. ఇందులో సూపర్ పాలిమర్ లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు.