CM Vijay: పరందుర్ ఎయిర్పోర్టు ప్రాజెక్టు రద్దు.. చెన్నై ఎయిర్పోర్టులో 5వ టర్మినల్: సీఎం విజయ్
CM Vijay: తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. పరందుర్ వద్ద నిర్మించాలనుకున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపాదిత విమానాశ్రయం కోసం కొత్త సైట్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. చెన్నై ఎయిర్పోర్టులో 5వ టర్మినల్ కట్టనున్నట్లు తెలిపారు.
చెన్నై: పరందుర్ వద్ద నిర్మించాలనుకున్న గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టు ప్రతిపాదనను రద్దు చేస్తున్నట్లు తమిళనాడు ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్(CM Vijay) తెలిపారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. సెక్షన్ 110 కింద ఆయన ప్రకటన చేస్తూ.. ప్రతిపాదిత విమానాశ్రయం కోసం కొత్త సైట్లను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆ లొకేషన్ను ఫైనలైజ్ చేస్తామన్నారు. ఇక టెక్నిల్ ఫీజిబులిటీ గురించి నిపుణులు పరిశీలిన చేయనున్నట్లు సీఎం విజయ్ చెప్పారు. గత డీఎంకే ప్రభుత్వాన్ని సీఎం విజయ్ తప్పుపట్టారు. ఎక్కువ సంఖ్యలో ప్రజలను తరలించే ప్రాంతాన్ని గత ప్రభుత్వం విమానాశ్రయ ప్రాజెక్టు కోసం తీసుకున్నదని, దీంతో పాటు వ్యవసాయంపై కూడా ఆ ప్రాంతంలో తీవ్ర ప్రభావం పడనున్నదని ఆయన అన్నారు.
పరందుర్ వద్ద విమానాశ్రయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నట్లు సీఎం విజయ్ స్పష్టం చేశారు. మరో వైపు చెన్నై విమానాశ్రయాన్ని విస్తరించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. చెన్నై విమానాశ్రయంలో అయిదో టర్మినల్ నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. దీని వల్ల ఏడాదికి 2 కోట్ల మంది అదనంగా విదేశీ ప్రయాణం చేసే వీలు ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఏడాదికి సుమారు 3 కోట్ల మంది ప్రయాణికులు చెన్నై విమానాశ్రయం ద్వారా ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న మూడవ టర్మినల్ పూర్తి అయితే విమానాశ్రయ సామర్థ్యం పెరగనున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

