CM Stalin: 7.5 లక్షల కోట్ల అక్రమాలు.. కాగ్ రిపోర్టుపై ప్రధాని మౌనం: సీఎం స్టాలిన్
CM Stalin: మోదీ పాలనలో 7.5 లక్షల కోట్ల అక్రమాలు జరిగిన కాగ్ రిపోర్టు ఇచ్చిందని, కానీ ప్రధాని మాత్రం ఆ రిపోర్టుపై మౌనం వీడడం లేదని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించారు. అయోధ్య డెవలప్మెంట్ ప్రాజెక్టు నుంచి ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వరకు ఆ అవినీతి జరిగినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రధాని కానీ, కేంద్ర మంత్రులు కానీ ఆ కాగ్ రిపోర్టుపై రియాక్ట్ కావడం లేదన్నారు.
చెన్నై: ప్రధాని మోదీతో పాటు ఆయన క్యాబినెట్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్(CM Stalin) తీవ్ర విమర్శలు చేశారు. కాగ్ రిపోర్టు ఇచ్చిన అక్రమాలపై ప్రధాని మోదీ స్పందించడంలేదని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. కాషాయ పార్టీ ఆగడాలను ఆపేందుకు ప్రజలంతా ఏకం కావాలన్నారు. మత, విభజన, నిరంకుశ, కార్పోరేట్ రాజకీయాలను తరిమికొట్టాలన్నారు. స్పీకింగ్ ఫర్ ఇండియా పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన స్టాలిన్.. కాగ్ ఇచ్చిన రిపోర్టుపై మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.
ఇండియా కూటమి అవినీతికి పాల్పడుతున్నట్లు మోదీ ఆరోపిస్తున్నారని, కానీ మోదీ పాలనలో దాగిన అవినీతిని కాగ్ ఎత్తిచూపిందని, ఆ రిపోర్టును మీరు చదివారా, ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో దాని గురించి చర్చించారా అని స్టాలిన్ అడిగారు. మోదీ సర్కార్‌లో సుమారు 7.5 లక్షల అక్రమాలు జరిగినట్లు కాన్ తన నివేదికలో పేర్కొన్నది. దీని పై మోదీ తన మౌనాన్ని వీడాలన్నారు. బీజేపీ ప్రభుత్వంలో అయిదు సీలు ఉన్నాయని, కమ్యూనలిజం(మతతత్వం), కరప్షన్(అవినీతి), కార్పొరేట్ పెట్టుబడిదారులు(కార్పొరేట్ క్యాపిటలిజం), చీటింగ్, క్యారెక్టర్ హత్యలకు పాల్పడుతోందని స్టాలిన్ ఆరోపించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

