చెన్నై: ఫొటోలోని కుర్రాడి పేరు సైనికేశ్ రవిచంద్రన్. వయసు 21 ఏండ్లు. తమిళనాడుకు చెందిన ఇతను.. పేరుకుదగ్గట్టే సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించాలని చిన్నప్పటి నుంచి కలలుకన్నాడు. అయితే పొడువు కారణంగా ఇండియన్ ఆర్మీకి ఎంపిక కాలేదు. అమెరికా సైన్యంలో చేరడానికి ప్రయత్నించినా కుదరలేదు. దీంతో ఉక్రెయిన్‌లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ చదివి ఓ కంపెనీలో వీడియో గేమ్ డెవలపర్‌గా చేరాడు. ఇంతలో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం రావడంతో కదనరంగంలోకి దిగి పోరాడుతున్నాడు.