సోమవారం 01 జూన్ 2020
National - May 08, 2020 , 15:30:47

మద్యం అమ్మకాలతో ఒకే రోజు రూ.150 కోట్లు

మద్యం అమ్మకాలతో ఒకే రోజు రూ.150 కోట్లు

చెన్నై: తమిళనాడులో ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. మద్యం అమ్మకాలు మాత్రం జోరుగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో మద్యం అమ్మకాలతో ఒక్క రోజులో రూ.150 కోట్లు ఆర్జించింది ప్రభుత్వం. కరోనా వైరస్‌ వ్యాప్తితో మార్చి 24న రాష్ట్రంలోని వైన్‌షాపులు మూతపడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చెన్నై మహానగరం మినహా రాష్ట్ర వ్యాప్తంగా మే 7న మద్యం అమ్మకాలను ప్రారంభించింది. దీంతో మొదటి రోజు ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు రూ.150 కోట్లు ప్రభుత్వానికి సమకూరాయి. తమిళనాడులో ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీఏఎస్‌ఎంఏసీ (తమిళనాడు స్టేట్‌ మార్కెటింగ్‌ కోఆపరేషన్‌ ద మోనోపోలీ సెల్లర్‌ ఆఫ్‌ లిక్కర్‌ ఇన్‌ ద స్టేట్‌)కి మొత్తం 5300 అమ్మకపు కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 25 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 5409 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 37 మంది మరణించారు. కొత్తగా 580 కరోనా కేసులు నమోదయ్యాయి.


logo