TN new CS : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రానికి నూతన చీఫ్ సెక్రెటరీ (New chief secretary) గా సీనియర్ ఐఏఎస్ అధికారి (Senior IAS officer) ఎన్ మురుగనందమ్ (N Muruganandam) బాధ్యతలు స్వీకరించారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న 50వ అధికారిగా మురుగనందమ్ గుర్తింపు పొందారు. సోమవారం ఉదయం 9.40 గంటలకు పాత సీఎస్ నుంచి కొత్త సీఎస్ బాధ్యతలు తీసుకున్నారు.
ఇప్పటివరకు తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తిరు శివ్ దాస్ మీనా (Tiru Shiv Das Meena) ను తమిళనాడు రియల్ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (TNRERA) ఛైర్మన్గా నియమించారు. ఆయన స్థానాన్ని ప్రస్తుతం తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ దగ్గర సెక్రెటరీగా పనిచేస్తున్న ఎన్ మురుగనందమ్తో భర్తీ చేశారు. ఆయన ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు.
As expected, N Muruganandam, Secretary I to Chief Minister MK Stalin has been appointed as the Chief Secretary to the State government: this follows appointment of Shiv Das Meena as chairman of TNRERA @xpresstn @NewIndianXpress pic.twitter.com/nBloJencFU
— T Muruganandham (@muruga_TNIE) August 19, 2024