Sanatana Dharma | హిందూ ఆలయంలో స్టాలిన్ కుమార్తె పూజలు.. ఇది సనాతన ధర్మం కాదా..?’ అంటూ ప్రశ్నిస్తున్న నెటిజన్స్
Sanatana Dharma | సనాతన ధర్మం (Sanatana Dharma)పై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమిసిపోకముందే.. మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందుకు కారణం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కుమార్తె సెంథామరై ఓ హిందూ ఆలయంలో పూజలు చేయడమే.
Sanatana Dharma | సనాతన ధర్మం (Sanatana Dharma)పై తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సమిసిపోకముందే.. మరో అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అందుకు కారణం తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) కుమార్తె సెంథామరై ఓ హిందూ ఆలయంలో పూజలు చేయడమే.
మైలాడుతురై (Mayiladuthurai) జిల్లా సిర్కాజీ ( Sirkazhi)లోని సత్తైనాథర్ ఆలయాన్ని (Sattainathar Temple) సెంథామరై స్టాలిన్ (Senthamarai Stalin) సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హారతి కళ్లకు అద్దుకుని.. కుంకుమ బొట్టు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై పలువురు నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘మరి దీన్ని ఏమంటారు..?, ఇది సనాతన ధర్మం కాదా..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
#WATCH | Tamil Nadu CM MK Stalin’s daughter Senthamarai Stalin visited and offered prayers at Sattainathar Temple in Sirkazhi, Mayiladuthurai district. (01.10) pic.twitter.com/DBNHRDvGSo
— ANI (@ANI) October 2, 2023
కాగా, ఇటీవలే చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. సనాతన ధర్మంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘సనాతన ధర్మం’ (Sanatana Dharma) డెంగీ, మలేరియా లాంటిది. దాన్ని నిర్మూలించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఉదయనిధి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేగాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పలువురు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. . ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. ఉదయనిధితోపాటు తమిళనాడు ప్రభుత్వం, సీబీఐ, తమిళనాడు పోలీసులు సహా 14 మందికి నోటీసులు కూడా జారీ చేసింది.
Also Read..
Viral Video | యువకుడి ప్రాణం తీసిన ఇన్‌స్టా రీల్స్ పిచ్చి
Ileana DCruz | అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న ఇలియానా.. అప్పుడే రెండు నెలలైందంటూ పోస్ట్
Elon Musk | మీకిది సిగ్గుచేటు.. కెనడా ప్రధాని ట్రూడోపై ఎలాన్ మస్క్ మండిపాటు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

