Tamil Nadu Assembly : తమిళనాడు రాష్ట్రంలోని మధురై నగరంలో టంగ్స్టన్ మైనింగ్‌కు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. వాటర్ రిసోర్స్ మినిస్టర్ దురై మురుగన్ ఈ తీర్మానాన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టారు. కేంద్ర సర్కారును ఈ తీర్మానం తీవ్రంగా విమర్శించింది. తమిళనాడు అభ్యంతరాలను లెక్కచేయకుండా కేంద్రం మధురైలో టంగ్స్టన్ మైనింగ్‌కు అనుమతులు ఇచ్చిందని మండిపడింది.
అసెంబ్లీలో తీర్మానానికి ఆమోదం లభించడానికి ముందు దీనిపై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. చివరకు ఆ తీర్మానానికి సభ ఆమోదం లభించింది. కేంద్ర ప్రభుత్వం మధురై నగరంలోని టంగ్స్టన్ గనులను తవ్వడానికి వేదాంత గ్రూప్‌కు అనుమతి ఇచ్చింది. దీనిపై అక్కడి ఆరిట్టపట్టి వాసులు ఆందోళనకు దిగారు. మైనింగ్‌ను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో రాష్ట్ర సర్కారు మైనింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.