రావత్‌ను రోల్‌మోడల్‌గా తీసుకోండి: రాష్ట్రపతి
సీడీఎస్ బిపిన్‌రావత్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుంటూ, కెరీర్లో ముందుకు సాగాలని సైనిక విధుల్లో చేరుతున్న

సీడీఎస్ బిపిన్‌రావత్‌ను రోల్‌మోడల్‌గా తీసుకుంటూ, కెరీర్లో ముందుకు సాగాలని సైనిక విధుల్లో చేరుతున్న వారికి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సూచించారు . డెహ్రాడూన్ మిలటరీ అకాడమీ పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మాట్లాడుతూ.. బిపిన్ రావత్ లేనిలోటు పూడ్చలేనిదన్నారు. ఆయనో అసాధారణ వ్యక్తి అని కొనియాడారు. ఒకవేళ హెలికాప్టర్ దుర్ఘటన జరగకపోయి ఉంటే, ఈ రోజు రావత్ కూడా తనతో కలిసి ఈ పరేడ్‌లో పాలుపంచుకునేవారని కోవింద్ గుర్తు చేసుకున్నారు. నూతనంగా సైన్యంలో చేరుతూ, తమ శిక్షణను పూర్తి చేసుకున్న వారికి కోవింద్ శుభాకాంక్షలు తెలిపారు.
బిపిన్ రావత్ దుర్మరణం అన్న షాక్ నుంచి తేరుకోక మునుపే ఇక్కడ సమావేశమయ్యామని, రావత్ ఈ కేంద్రంలోనే శిక్షణ తీసుకొని, అనేక మెడల్స్‌ను సాధించారని రాష్ట్రపతి గుర్తు చేసుకున్నారు. రక్షణ విషయంలో దేశం ఓ సవాల్‌ను ఎదుర్కొంటోందని, దీనికి అందరూ మానసికంగా సన్నద్ధమై ఉండాలని, ఓ వ్యూహాత్మకమైన మానసిక పరిణతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. అనుకోని సవాళ్లు ఎదురైనప్పుడు కూడా వాటిని ఎదుర్కోడానికి సంసిద్ధత వ్యక్తం చేసేలా ఉండాలని రాష్ట్రపతి కోవింద్ ఆకాంక్షించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

