Taj Mahal: ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న తాజ్ మహల్ పాలరాతి కట్టడమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. పాలపుంతను గుర్తు చేసినట్టుగా తెలుపు వర్ణంలో మెరిసిపోయే ఈ షాజహాన్ ప్రేమ కట్టడం రంగు మారుతోంది. తెలుపు వర్ణం కాస్తా ఆకుపచ్చ రంగులోకి మారుతుండటం ఆందోళనకు గురిచేస్తున్నది. అయితే తాజ్ మహల్ హరిత రూపును సంతరించుకోవడం ఇదే మొదటిసారి కాకపోయినా నవంబర్ మాసంలో హరిత వర్ణంలోకి మారుతుండటంపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పురావస్తు శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. తాజ్ మహల్‌లోని యమునా నది తీరం వైపునకు ఉన్న కొంత కట్టడం ఆకుపచ్చగా మారుతోంది. ఇది 2015 నుంచి ప్రతి ఏడాది జరుగుతున్న ప్రక్రియనే. అయితే యేటా మాత్రం జూన్‌లో ఒకసారి ఇలా జరిగాక మళ్లీ శీతాకాలం మొదలయ్యాక ఇలా అవుతుండటానికి గల ఆందోళనకు గురిచేస్తున్నది అని ఆగ్రా సర్కిల్‌కు చెందిన సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్టు రాజ్ కుమార్ తెలిపారు.
Archaeologists Launch Research as Insects Turn Taj Mahal Green
🕌 The pristine white Taj Mahal, a World Heritage Site, is marred by green stains caused by the Goeldichironomus insect, excreting on the marble surface and inlay work.
1/6| #TajMahal | #insects | #Archaeology | pic.twitter.com/XOy78fIgun
— Sputnik India (@Sputnik_India) November 29, 2023
ఎందుకిలా..?
తాజ్ మహల్ గోడలు ఇలా రంగు మారడానికి కారణం ఒక కీటకం అని ఓ అధ్యయనంలో తేలింది. గోయెల్డిచిరోనోమస్ అనే ఓ పురుగు దీనికి ప్రధాన కారణమని 2016లో ఆగ్రాకు చెందిన సెయింట్ జాన్స్ కాలేజ్, స్కూల్ ఆఫ్ ఎనటామోలాజీ విభాగంలో పనిచేసే డాక్టర్ గిరీష్ మహేశ్వరి తేల్చి చెప్పారు. గోయెల్డిచిరోనోమస్ యమునా నదిలో ఉండే నాచును తిని తాజ్ మహల్ గోడలపై అది విసర్జిస్తాయి. వాటి శరీరంలో ఉండే క్లోరోఫిల్ వల్ల అవి పాలరాయిపై ఆకుపచ్చ మరకలా కనిపిస్తుంది.. అని తన నివేదికలో వెల్లడించింది. ఈ కీటకాలకు తెల్లని పాలరాయికి ఆకర్షితమయ్యే గుణం ఉందని ఆమె తన నివేదికలో పేర్కొన్నారు. అయితే సాధారణంగా గడిచిన ఏడేనిమిదేండ్లుగా ఇవి జూన్-జులైలో జరుగుతుండగా ఇప్పుడు నవంబర్‌లో తాజ్ మహల్ రంగు మారుతుండటం ఆందోళనకు గురిచేస్తున్నది.