న్యూఢిల్లీ : సెలబ్రిటీలు ఫుడ్ ఆర్డర్లను స్వీకరించడాన్ని అనుకరిస్తున్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ను ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా ఇప్పటివరకూ ఏకంగా పదిలక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కంటెంట్ క్రియేటర్ జగ్‌జ్యోత్ సింగ్, స్విగ్గీ సంయుక్తంగా ఈ క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాయి.
ఈ క్లిప్‌లో వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్, జాన్ అబ్రహం, రణ్వీర్ సింగ్, రంధ్వా వంటి పలువురు సెలబ్రిటీలు తమ ఫుడ్ ఆర్డర్లను ఎలా స్వీకరిస్తారనేది జగ్‌జ్యోత్ సింగ్ పర్ఫెక్ట్గా అనుకరించడం ఆకట్టుకుంటుంది. వరుణ్ ట్రేడ్‌మార్క్ స్మైల్‌ను, కార్తీక్ ఆర్యన్ చేయి ఊపే స్టైల్‌ను జగ్‌జ్యోత్ సింగ్ దించేశాడు.
ఈ సెలబ్రిటీలు ఏం ఆర్డర్ చేశారో మీరు ఊహించగలరా అని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. జగ్‌జ్యోత్ ట్యాలెంట్‌ను పలువురు యూజర్లు ప్రశంసించగా బాలీవుడ్ మీ కోసం ఓ నటుడు ఇక్కడ ఉన్నాడని మరో యూజర్ రాసుకొచ్చారు.