న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో తనపై దాడి జరిగిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ (Swati Maliwal) ఆరోపించిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ తన కడుపులో, సున్నిత భాగాలపై కొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆ రోజు కేజ్రీవాల్ ఇంట్లో జరిగిన సంఘటనకు సంబంధించిన ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరిన కేజ్రీవాల్ ఇంటి వద్ద ఉన్న సిబ్బందితో స్వాతి మలివాల్ వాదనకు దిగింది. తాను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేశానని, పోలీసులు వచ్చిన తర్వాతే వెళ్లతానని వారితో అన్నది. అలాగే తనను తాకితే ఉద్యోగం పోతుందంటూ అక్కడ ఉన్న సిబ్బందిని ఆమె బెదిరించింది.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో క్లిప్‌పై స్వాతి మలివాల్ స్పందించింది. తనను తాను రక్షించుకోవడానికి ‘రాజకీయ హిట్‌మ్యాన్’ ప్రయత్నాలు ప్రారంభించాడని ఆరోపించింది. ‘ఎప్పటిలాగే, ఈ రాజకీయ హిట్‌మాన్ మరోసారి తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన వ్యక్తులతో ట్వీట్ చేయించడం, సగం వీడియోలను పోస్ట్ చేయించడం ద్వారా ఈ నేరం నుంచి తప్పించుకోగలనని అతడు భావిస్తున్నాడు. ఒకరిని కొట్టేటప్పుడు వీడియో ఎవరు తీస్తారు? ఆ గదిలోని సీసీటీవీ ఫుటేజీని పూర్తిగా పరిశీలిస్తే అసలు విషయం అందరికీ తెలుస్తుంది. ఏ స్థాయికి దిగజారాలని కోరుకుంటున్నావో? దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక రోజు నిజం బయటపడుతుంది’ అని ఎక్స్‌లో ఆమె పోస్ట్ చేసింది.
IANS Exclusive
In visuals: Swati Maliwal assault case, incident captured on camera at Delhi CM official residence – 13th May pic.twitter.com/AIdTl1ebGO
— IANS (@ians_india) May 17, 2024
हर बार की तरह इस बार भी इस राजनीतिक हिटमैन ने ख़ुद को बचाने की कोशिशें शुरू कर दी हैं।
अपने लोगों से ट्वीट्स करवाके, आधि बिना संदर्भ की वीडियो चलाके इसे लगता है ये इस अपराध को अंजाम देके ख़ुद को बचा लेगा। कोई किसी को पीटते हुए वीडियो बनाता है भला? घर के अंदर की और कमरे की CCTV…
— Swati Maliwal (@SwatiJaiHind) May 17, 2024