కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి(Suvendu Adhikari) ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. స్వాతంత్య్రం తర్వాత బెంగాల్ రాష్ట్రానికి బీజేపీ పార్టీకి నుంచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి వ్యక్తిగా సువేందు రికార్డు క్రియేట్ చేశారు. ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు చెందిన సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సువేందు .. ప్రధాని మోదీ ఆశీస్సులు తీసుకున్నారు. వేదికపై ఉన్న నేతలతో కరచాలనం చేశారు. సువేందు అధికారి బాధ్యతలు చేపట్టడంతో.. బెంగాల్లో కొత్త చరిత్ర లిఖితమైంది. చాన్నాళ్లుగా బెంగాల్‌పై పట్టు కోసం ప్రయత్నించిన బీజేపీ చివరకు విజయాన్ని సాధించింది. తాజా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 207 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. దీంతో మమతా బెనర్జీ ఆధిపత్యానికి గండి పడింది.
#WATCH Kolkata | BJP leader Suvendu Adhikari greets PM Narendra Modi and other senior leaders of the NDA after taking oath as the Chief Minister of West Bengal pic.twitter.com/xjgOgTh6U9
— ANI (@ANI) May 9, 2026
బెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 9వ వ్యక్తిగా సువేందు అధికారి నిలిచారు. సువేందు వయసు 55 ఏళ్లు. బెంగాల్ గ్రామీణ జిల్లాల్లో ఆయనకు మంచి పట్టు ఉన్నది. సువేందు అధికారి తండ్రి గతంలో కేంద్ర మంత్రిగా చేశారు. ఆయన పేరు సిసిర్ అధికారి. కాంగ్రెస్ స్టూడెంట్ వింగ్‌లో సువేందు తన కెరీర్‌ను మొదలుపెట్టారు. బెంగాల్లో వామపక్షాల ఆధిపత్యం ఉన్న సమయంలో.. ఛాత్ర పరిషత్‌లో సువేందు కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత ఆయన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
బీజేపీలో చేరడానికి ముందు దీదీకి చాలా నమ్మకస్తుడిగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన మమతా బెనర్జీకి ప్రధాన ప్రత్యర్థిగా తయారయ్యారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 207 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే రెండు సార్లు దీదీపై పోటీ చేసి సువేందు నెగ్గారు.