Himachal Pradesh: హిమాచల్ లోయలో పడిన ఎస్యూవీ.. ఏడు మంది మృతి
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో ఓ ఎస్యూవీ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. చంబా జిల్లాలోని చంబా-మసూరంద్ రోడ్డు మార్గంలో ఉన్న చాత్రుండ్ వద్ద భారీ లోయలో వాహనం పడింది. స్కిడ్ కావడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
చంబా: హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh)లో బుధవారం రాత్రి ఓ ఎస్యూవీ లోయలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందారు. చంబా జిల్లాలోని చంబా-మసూరంద్ రోడ్డు మార్గంలో ఉన్న చాత్రుండ్ వద్ద భారీ లోయలో వాహనం పడింది. స్కిడ్ కావడం వల్ల ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బాధితులను కుతెడ్ గ్రామ పంచాయతీలోని మహల్ గ్రామస్థులుగా గుర్తించారు. మరో గ్రామంలో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. చాత్రుండ్ వద్ద వాహనం డ్రైవర్ అదుపు తప్పిందని, దీంతో లోయలోకి బోల్తా కొట్టిందన్నారు. చాలా బలంగా రాళ్లను ఢీకొంటూ వాహనం లోయలో పడింది. దీంతో ఆ వాహనం నుజ్జునుజ్జు అయ్యింది.
ప్రమాద స్థలంలోనే ఆరుగురు మృతిచెందారు. ఆ తర్వాత గాయాల వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు ఆడ, ముగ్గురు మగవారున్నారు. బాధితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాద ఘటన గురించి పోలీసులకు తెలియజేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా డేంజర్‌గా ఉంటుందని, అక్కడ క్రాష్ బారియర్లు ఏమీ లేవని స్థానికులు ఆరోపించారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని, కానీ ప్రమాద ఘటనకు చెందిన సరైన కారణాన్ని ఇంకా గుర్తించలేదని ఎస్పీ విజయ్ సాక్లానీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saluru | ఎన్నికల కోసం పెళ్లి.. చివరికి సీటు జనసేనకు! టీడీపీ నేతకు షాక్ మీద షాక్!
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

