భువనేశ్వర్: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనకు సంబంధించి ఏడుగురు రైల్వే ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. వీరిలో ముగ్గురిని ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసింది. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా ఉండి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని సౌత్ ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ అనిల్ కుమార్ మిశ్రా అన్నారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే సీనియర్ సెక్షన్ ఇంజనీర్ (సిగ్నల్) అరుణ్‌కుమార్ మహంత, సెక్షన్ ఇంజనీర్ మహమ్మద్ అమీర్ ఖాన్, టెక్నీషియన్ పప్పు కుమార్‌లను అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.