న్యూఢిల్లీ : అనుమానిత ఐసిస్ టెర్రరిస్ట్ ((ISIS Terrorist)తో పాటు మరో ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న ఐసిస్ టెర్రరిస్ట్ మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీ ఉజ్మాను పట్టిచ్చిన వారికి రూ 3 లక్షల రివార్డు ప్రకటించారు.
ఐసిస్ మాడ్యూల్‌పై సమాచారం అందడంతో ఉగ్రవాద అనుమానితులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ సహా ఉత్తరాదిలో ఉగ్రదాడులకు వీరు ప్రణాళికలు రూపొందించినట్టు భావిస్తున్నారు. వృత్తిరీత్యా ఇంజనీర్ అయిన షానవాజ్ కోసం పుణే ఐసిస్ మాడ్యుల్ కేసులో గాలిస్తున్నారు.
ఢిల్లీకి చెందిన షానవాజ్ పుణేలో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. షానవాజ్ సహా ముగ్గురు ఉగ్రవాద అనుమానితులను ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. ఐఈడీలను తయారుచేయడంలో వాడే లిక్విడ్ కెమికల్ సహా వారి నుంచి పలు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Read More :
NIA | ఏపీ, తెలంగాణలో ఎన్ఐఏ దాడులు.. పౌరహక్కుల నేతల ఇండ్లలో సోదాలు