Suresh Gopi: నిన్న ప్రమాణ స్వీకారం.. నేడు రాజీనామా.. కేంద్ర మంత్రి పదవిపై సురేశ్ గోపి అసంతృప్తి
Suresh Gopi : సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిల్లో నటించాల్సి ఉంది. అందుకే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకోవాలనుకుంటున్నట్లు సురేశ్ గోపి ఓ మీడియాకు తెలిపారు. కేంద్ర క్యాబినెట్ ర్యాంక్ కాకుండా.. సహాయ మంత్రిగా ప్రమాణం చేయడం పట్ల ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర నాయకత్వం ఆదేశం ప్రకారం నడుచుకోనున్నట్లు వెల్లడించారు.
న్యూఢిల్లీ: కేరళలోని త్రిసూరు నుంచి గెలిచిన బీజేపీ అభ్యర్థి సురేశ్ గోపి(Suresh Gopi).. ఆదివారం కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ప్రమాణ స్వీకారం చేసి ఒక్క రోజు కూడా గడవలేదు.. అప్పుడే ఆయన తన మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు తెలిసింది. పెండింగ్లో ఉన్న సినిమా షూటింగ్లను పూర్తి చేసేందుకు.. మంత్రి పదవి నుంచి వైదొలగాలని సురేశ్ గోపి భావిస్తున్నట్లు ఓ మలయాళీ మీడియా కథనాన్ని రాసింది. కేరళలో చరిత్రాత్మక విజయం సాధించిన సురేశ్ గోపి.. తనకు సహాయ మంత్రి పదవి ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి పదవి నుంచి నన్ను రిలీవ్ చేస్తారని భావిస్తున్నానని, సినిమాలను పూర్తి చేయాల్సి ఉందని, ఈ అంశంపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని, ఒక ఎంపీగా తాను త్రిసూరులో మెరుగైన సేవలు అందిస్తానని, తనకు క్యాబినెట్ పొజిషన్ అవసరం లేదని సురేశ్ గోపి ఆ మీడియాకు తెలిపారు.
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఢిల్లీకి రావాలని పిలిచినప్పుడు.. బీజేపీ కేంద్ర నాయకులతో తన సినిమా కమిట్మెంట్ల గురించి సురేశ్ గోపి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. సురేశ్ గోపి ప్రస్తుతం నాలుగు చిత్రాల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. పద్మనాభస్వామి ఆలయంపై తీస్తున్న చారిత్రక నేపథ్య చిత్రంలోనూ ఆయన నటిస్తున్నారు. ఒకవేళ సినిమాలను ఆపేస్తే, అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ సిబ్బంది సంక్షోభంలోకి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సురేశ్ గోపి తెలిపారు. సినిమాల కోసం కేంద్ర మంత్రి పదవిని త్యాగం చేయడం మూర్ఖత్వం అవుతుందని కొందరు సురేశ్ గోపికి చెప్పినట్లు కూడా తెలుస్తోంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

