త్రిసూర్: సినీ నటుడు సురేష్ గోపి(Suresh Gopi).. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన 2019 లోక్సభ ఎన్నికల్లో త్రిసూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2021లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటమి చవి చూశారు. ఇక ఈసారి ఆయన త్రిసూర్ నుంచి పోటీ చేస్తున్నా.. ఓ బలమైన ప్రత్యర్థిని ఎదుర్కోనున్నారు. కాంగ్రెస్ నేత కే మురళీధరన్, సీపీఐ నుంచి వీ సునిల్కుమార్లను ఆయన ఓడించాల్సి ఉంటుంది. ఇక ఎన్నికల అఫిడవిట్లో సురేష్ గోపి తన ఆస్తుల వివరాలు వెల్లడించారు. ఆయన ఆస్తులు సుమారు 12 కోట్లు పైనే ఉన్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ రెండో తేదీన ఆయన తన నామినేషన్ పేపర్లను సమర్పించారు. 2023-24లో ఆయన ఆదాయం నాలుగున్నర కోట్లుగా ఉంది. చరాస్థి కింద ఆయన 8 వాహనాలను, కిలో బంగారాన్ని చూపించారు. వాటి ఆస్తి సుమారు 4 కోట్లు ఉంటుంది. స్థిరాసి కింద ఆయన వ్యవసాయ భూమి, ఏడు వ్యవసాయేతర భూములు, ఏడు రెసిడెన్షియల్ బిల్డింగ్లను చూపించారు. 2019 లోక్సభ ఎన్నికల వేళ ఆయన తన ఆస్తిని 10 కోట్ల పైన చూపించారు.