సూరత్: సూరత్‌లోని జహంగీర్‌పుర, టైమ్స్ గెలాక్సీలో నివసిస్తున్న నితిన్ భాయ్ అదియా (57) మృత్యుంజయుడిగా నిలిచారు. ఆయన గురువారం ఉదయం 8 గంటలకు పదో అంతస్తులోని ఫ్లాట్‌లో కిటికీ పక్కన గాఢ నిద్రలో ఉండగా పక్కకు ఒరిగిపోయి, జారిపోయారు. ఆ వేగంతో ఆయన కింద పడిపోతే ప్రాణాలు దక్కేవి కాదు.
కానీ ఎనిమిదో అంతస్తులోని గ్రిల్లో ఆయన కాలు చిక్కుకుపోయింది. దీంతో ఆయన తలకిందులుగా వేలాడుతూ ఉండిపోయారు. దీనిని గమనించిన స్థానికులు అగ్నిమాపక కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. వారు పై అంతస్తు నుంచి తాళ్లు, సేఫ్టీ బెల్టుల సాయంతో ఆయనను సురక్షితంగా కిందికి దించగలిగారు.