Odisha Legislative Assembly : బీజేపీ సీనియర్ నేత, రణ్పూర్ ఎమ్మెల్యే సురామ పాధి 17వ ఒడిషా శాసనసభ స్పీకర్గా గురువారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
సురామ పాధికి ఒడిషా సీఎం మోహన్ చరణ్ మాఝీ, డిప్యూటీ సీఎంలు కనక్ వర్ధన్ సింగ్ దేవ్, ప్రవతి పరీదా, ప్రోటెం స్పీకర్ రణ్వేంద్ర ప్రతాప్ స్వైన్, ఒడిషా మాజీ సీఎం, విపక్ష నేత, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్ సహా పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు.
నూతన స్పీకర్ సభను అత్యంత సమర్ధవంతంగా నడుపుతూ సభా సమయాన్ని విలువైన చర్చలు జరిగేలా చూస్తారని నేతలు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.
Read More :