Supreme Court | కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. 18న విచారణ జరుపనున్న సర్వోన్నత న్యాయస్థానం
Supreme Court | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అనర్హతకు గురైన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్‌పై ఈ నెల 18న విచారణ జరుపనున్నది.
Supreme Court | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో అనర్హతకు గురైన ఆరుగురు కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అనర్హతను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషన్‌పై ఈ నెల 18న విచారణ జరుపనున్నది. ఆరుగురు ఎమ్మెల్యేలు ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఓటు వేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా విప్‌ను ధిక్కరించినందుకు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఫిబ్రవరి 27న జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌కు అనుకూలంగా ఓటు వేసిన కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆ తర్వాత బడ్జెట్‌పై ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కారణంగా ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నది. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలలో రాజిందర్ రాణా, సుధీర్ శర్మ, ఇందర్ దత్ లఖన్‌పాల్, దేవిందర్ కుమార్ భుత్తు, రవి ఠాకూర్, చేతన్య శర్మ ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో 68 మంది ఎమ్మెల్యేలున్నారు. అనర్హత వేటువేయడంతో ఎమ్మెల్యేల సంఖ్య 62 తగ్గింది. కాంగ్రెస్‌కు ఇంతకు ముందు 40 మంది సభ్యుల బలం ఉండగా.. ఈ సంఖ్య 36కి పడిపోయింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

