న్యూఢిల్లీ: గ్రేటర్ నోయిడా మెజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. జూలైలో జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో పాల్గొన్న సెకండ్ ఇయర్ విద్యార్థికి మెజిస్ట్రేట్ నోటీసు ఇవ్వడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. సీజేపీ ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదు అయిన కేసులన్నీ కొట్టివేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా.. ఎలా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ నోటీసులు ఇచ్చారని కోర్టు ప్రశ్నించింది. విద్యార్థులపై ఎటువంటి చర్యలు అవసరం లేదని స్పష్టంగా ఆదేశించామని, నోటీసులు ఇవ్వడానికి మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం అని సుప్రీం పేర్కొన్నది. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనతో కూడిన ధర్మాసనం ఈ కేసులో స్పందిస్తూ.. నిరసనకారులపై ఎటువంటి క్రిమినల్ చర్యలు తీసుకోవద్దు అని తమ ఆదేశాల్లో స్పష్టం చేసినట్లు చెప్పింది.