న్యూఢిల్లీ: మన దేశంలో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దేశంలోని న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్ వివాదాల్లో 66 శాతం మేరకు స్థిరాస్తుల వివాదాలు ఉన్నాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఆస్తి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పారదర్శకంగా, సులభంగా మార్చడానికి బ్లాక్‌చైన్ టెక్నాలజీ వంటివాటిని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
వలస పాలకుల కాలం నాటి చట్టాలు ఇప్పటికీ అమలవుతున్నాయని గుర్తు చేసింది. ప్రస్తుతం ఆస్తి లావాదేవీలు గందరగోళంగా, వివాదాలకు ఆస్కారం కల్పించే విధంగా ఉంటున్నాయని పేర్కొంది. ఓ కేసులో ఇచ్చిన తీర్పులో ఈ వ్యాఖ్యలు చేసింది.