న్యూఢిల్లీ: తమిళనాడులో గోవధను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) స్టే విధించింది. ఇస్లామ్ మతంలో గోవులను వధించడం మతపరమైన సంప్రదాయం కాదు అని గతంలో మద్రాసు హైకోర్టు పేర్కొన్నది. అయితే బక్రీద్ వేళ కానీ ఇతర సందర్భాల్లో గోవులను చంపడం నిషేధించాలని హైకోర్టు తన తీర్పులో చెప్పింది. అయితే ఆ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం ఇవాళ తమిళనాడు సర్కారుకు నోటీసు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం స్టే కూడా విధించింది.
సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వీ, అదరనపు అడ్వకేట్ జనరల్ ప్రశాంతో సేన్.. తమిళనాడు సర్కారు తరపున వాదించారు. పబ్లిక్ స్థలాల్లో గోవులను వధించడం ఆపాలని, దానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ కోయంబత్తూరు నివాసితులు కే సూర్య హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మే 27వ తేదీన ఆ పిటీషన్‌పై జస్టిస్ జీఆర్ స్వామినాథన్, వీ లక్ష్మీనారాయణన్ తమ తీర్పును వెలువరించారు.
బక్రీద్ వేళ ఎటువంటి గోవధ జరగవద్దు అని హైకోర్టు ఆ పిటీషన్ ఆధారంగా రాష్ట్రాన్ని ఆదేశించింది. గోవధ అంశంపై హైకోర్టు తన పరిధి దాటిందని, ఆ తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.