Supreme Court: ఈషా ఫౌండేషన్‌పై పోలీసుల యాక్షన్‌కు బ్రేక్.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు సుప్రీంలో ఊరట
Supreme Court : సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు సుప్రీంలో ఊరట దొరికింది. ఈషా ఫౌండేషన్‌పై మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం స్టే విధించింది.
న్యూఢిల్లీ: సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేషన్‌పై పోలీసుల చర్యలకు బ్రేక్ వేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు(Supreme Court) ఆదేశాలు ఇచ్చింది. ఈషా ఫౌండేషన్‌తో లింకున్న అన్ని క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో తమిళనాడు పోలీసులు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో ఈషా ఫౌండేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాసు హైకోర్టు ఆదేశాలపై సుప్రీం స్టే ఇచ్చింది. కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆశ్రమంలో ఉన్న తన ఇద్దరు కూతుళ్లకు బ్రెయిన్‌వాష్ చేశారని, దాంతో వాళ్లు ఇంటికి రావడం లేదని ఓ తండ్రి దాఖలు చేసిన పిటీషన్ ఆధారంగా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఈ కేసులో వాదనలు విన్నది. ఆ ఇద్దరు మహిళలతో ధర్మాసనం మాట్లాడింది. తమ ఇష్టపూర్వకంగానే ఆశ్రమంలో ఉంటున్నట్లు ఆ ఇద్దరు మహిళలు వెల్లడించారు. తమను ఎవరూ నిర్బంధించడంలేదని పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్‌పై నమోదు అయిన కేసును మద్రాసు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. తమిళనాడు పోలీసులు ఇచ్చే స్టేటస్ రిపోర్టును సుప్రీంకు సమర్పించాలని ఆదేశించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

