న్యూఢిల్లీ: తెలుగు రాష్ర్టాలతో పాటు పలు రాష్ర్టాలకు వాయిదా పడుతూ వస్తున్న బార్ కౌన్సిల్ల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలు జరగని బార్ కౌన్సిల్లకు వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తి చేయాలని బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ, ఏపీలతో పాటు పలు బార్ కౌన్సిళ్ల ఎన్నికలు రెండేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్నాయి. దాంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రూల్ 32పై సుప్రీం కోర్టును బార్ కౌన్సిల్ మెంబర్ వర్ధన్ ఆశ్రయించారు.