న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఖాతాల విషయంలో మైనర్లకు రక్షణ చర్యలు అవసరమని పేర్కొన్న సుప్రీం కోర్టు ఈ విషయంలో వివరణ ఇవ్వాలంటూ కేంద్రాన్ని ఆదేశించింది. సామాజిక మాధ్యమ ఖాతాలను మైనర్లు నిర్వహించకుండా నిషేధం విధించాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది.
భారతదేశ చట్టాల ప్రకారం ఒక మైనర్ ఒప్పందం కుదుర్చుకోవడం నిషేధమని, అలాంటప్పుడు వారు సామాజిక మాధ్యమంలో ఖాతాలు సృష్టించేటప్పుడు ఆన్లైన్ ఒప్పందాలను ఎలా అంగీకరిస్తారంటూ ఓ ఎన్జీవో సంస్థ కేసు దాఖలు చేసింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖలతో పాటు కార్మిక, న్యాయ శాఖలకు నోటీసులు జారీ చేసింది.