న్యూఢిల్లీ : దర్యాప్తునకు అవసరమైన వ్యక్తులకు నోటీసులను భౌతికంగానే అందజేయాలని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. వాట్సా ప్ వంటి ఎలక్ట్రానిక్ పద్ధతుల్లో పోలీసు సమన్లను పంపించడానికి అనుమతించాలంటూ హర్యానా ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు నిరాకరించింది.
జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం ఈ పిటిషన్ను జూలై 16న తోసిపుచ్చింది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ ప్రకారం ఏ వ్యక్తికి అయినా పోలీసులు నోటీసు ఇస్తే, ఆ వ్యక్తి దర్యాప్తునకు హాజరుకావాలి. ఈ నోటీసును ఉల్లంఘిస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ధర్మాసనం తెలిపింది.