న్యూఢిల్లీ: ఒక అభ్యర్థి తన పాఠ్యాంశాల్లో భాగంగా అవసరమైన ప్రధాన సబ్జెక్టును చదివినప్పుడు, అతని డిగ్రీ వేరే స్పెషలైజేషన్‌లో ఉందనే కారణంతో ఉద్యోగానికి అతని అభ్యర్థిత్వాన్ని తిరస్కంచలేమని సుప్రీం కోర్టు పేర్కొంది. మధ్యప్రదేశ్‌లో ఎం.కామ్ అర్హత ఉన్న ఒక అభ్యర్థిని మానిటరింగ్ అండ్ కన్సల్టెంట్‌గా నియమించడాన్ని సుపీ్రం ధర్మాసనం ఆమోదించింది.
వాస్తవానికి ఈ పోస్టుకు స్టాటిస్టిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి. అయితే నియమితుడైన అభ్యర్థికి బిజినెస్ స్టాటిస్టిక్స్, ఇండియన్ ఎకనామిక్ స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఎం.కామ్ డిగ్రీ ఉంది. సంబంధిత స్టాటిస్టిక్స్ను పీజీలో సబ్జెక్టుగా చదివినందున ఆ అభ్యర్థికి స్టాటిస్టిక్స్లోనే పీజీ అర్హత ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.